Tuesday 31 December 2019

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ ఊసే లేకపోవడం అన్నది దంపతుల్ని అనుక్షణం తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తుంది. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సి, ఇమ్సి వంటి అత్యాధునిక చికిత్సల సాయంతో నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించడం ఇపుడు ఏమంత కష్టం కాదు. భర్తలో వీర్య కణాలు ఏమాత్రం లేకపోవడం అంటే జీరో కౌంట్ ఉన్నవారికి కూడా ఇపుడు టెసా అనే ఒక సరికొత్త పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మరవకండి.

Thursday 26 December 2019

ఈ బ్లడ్ నిజంగా బంగారమే... (Golden Blood)

రక్తం అంటే మనకు ప్రాణాధారం. మన ఒంట్లోని అణువణువుకూ జవజీవాలతోపాటు ప్రాణ వాయువును అందించే అపురూపమైన సంజీవిని. అందుకే రక్తదానాన్ని మనం ప్రాణదానంగా పేర్కొంటున్నాం. ఇక మన రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు ఉంటాయని మనకు తెలుసు. వీటిలో అరుదైన బ్లడ్ గ్రూపు ఏదంటే వెంటనే మనలో చాలామంది ఓ గ్రూపు అని ఠక్కున చెప్పేస్తారు. ఇంకాస్త అవగాహన ఉన్నవాళ్లైతే... బాంబే బ్లడ్ గ్రూప్ అని చెబుతారు. కానీ వీటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ మరోటి ఉంది. దాని పేరే గోల్డెన్ బ్లడ్. పేరుకు తగ్గట్టుగానే అది నిజంగా బంగారమే. 
బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 43 మంది వ్యక్తుల్లో మాత్రమే ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇదెంత అరుదైన గ్రూపు రక్తమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ బ్లడ్ కలిగిన వ్యక్తులు ఓ గ్రూపు వ్యక్తుల్లాగే అందరికీ తమ రక్తాన్ని దానం చేయొచ్చు. కానీ వీరికి రక్తం అవసరమైనపుడు మాత్రం దాతలు దొరికే పరిస్థితి ఉండదు. కాస్త కష్టమైనా ఓ గ్రూపు రక్తాన్ని ఎక్కడి నుంచైనా పట్టుకు రావొచ్చేమోగానీ... గోల్డెన్ బ్లడ్ ను పట్టుకు రావడానికి ప్రపంచమంతా తిరగాల్సి ఉంటుంది.
గోల్డెన్ బ్లడ్... పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైంది.  ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్ (Rh null). ఈ రక్తం ఎందుకంత ప్రత్యేకం? దీన్ని బంగారంతో ఎందుకు పోల్చుతారు? ఈ రక్తం కలిగి ఉండటం ఎందుకు ప్రమాదకరం? ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే, ముందుగా మన బ్లడ్ గ్రూపులు ఏ, బీ, ఏబీ, ఓ లను ఎలా వర్గీకరించారో తెలుసుకోవాలి.
సాధారణంగా మన రక్తంలోని రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. '' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ యాంటీజెన్లు రెండూ ఉండవు. అలాగే ఎర్ర రక్త కణాలు 61 Rh రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు. గోల్డెన్ బ్లడ్ గా పిలుస్తోన్న Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు. వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్‌సైట్ మొజాయిక్‌లో ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది.
గోల్డెన్ బ్లడ్ రావడం అనేది వంశపారంపర్యంగానే జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు వివరించారు. బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. అలాగే ఈ రక్తాన్ని కలిగి ఉండటం అనేది ప్రమాదం కూడా. ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.

Monday 23 December 2019

ఇవాళ పొట్టను చేత పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అజీర్ణం, ఎసిడిటీ, పులి తేన్పులు, కడుపు ఉబ్బరం, గ్యాస్... ఇలా ఉదర భాదలకు అంతం ఉండటం లేదు. అసలు తినాలనిపించక పోవడం, ఏం తిన్నా విరేచనం అయిపోవడం, ఛాతీలో, కడుపులో మంట, ఆపాన వాయువులు... ఇలా పొట్టలో ఇవాళ చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. మరి ఈ ఎసిడిటీ బాధల నుంచి విముక్తి ఎలా? ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం కలిగించే చిట్కాల కోసం వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మరవకండి.
https://youtu.be/20De3xPIVM4
www.arogyamastu.blogspot.com

తనువుల్ని, మనుసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతోపాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని చక్కదిద్దే ఆహార పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

https://youtu.be/FHA6Dq70WaM
www.arogyamastu.blogspot.com

పరిమితంగా, రోజుకు ఒక పెగ్గుకు మించకుండా మద్యాన్ని పుచ్చకుంటే అది మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన గుండెకు ఎంతగానో మేలు చేస్తుందనే నమ్మకం ఇవాళ మనలో చాలామందిలో ఉంది. ప్రత్యేకించి రెడ్ వైన్ తాగితే గుండె బలం పుంజుకుంటుందని నమ్ముతారు. అసలీ నమ్మకాల్లో నిజమెంత? మద్యాన్ని మితంగా తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కి సబ్ స్క్రైబ్ చేయండి.
https://youtu.be/0_Nshyup25A
www.arogyamastu.blogspot.com

Thursday 19 December 2019

పక్షవాతానికి గురవుతోన్న సమయంలో మన మెదడు మనతో మాట్లాడటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కొన్ని లక్షణాల ద్వారా తన సందేశాన్ని పంపుతుంది. ఆ లక్షణాలను మనం ఇంగ్లీషులో FAST అని గుర్తుంచుకుంటే చాలు. పక్షవాతాన్ని ఆదిలోనే పసిగట్టి సత్వర వైద్యాన్ని పొందే వీలుంటుంది. పక్షవాతం తాలూకు దుష్ఫలితాలను సైతం నివారించుకునే అవకాశం దొరుకుతుంది. ఇంతకీ FAST అనే పదంలోని ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

Friday 13 December 2019

నొప్పి లేని గుండె పోటు గురించి మీకు తెలుసా?

గుండె పోటు అంటే ఛాతీ అంతా పిండేసి నట్టుగా నొప్పి ఉంటుందని నమ్ముతారు మనలో చాలామంది. ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుందనీ, ఛాతీపై ఎవరో కూర్చున్నంత బరువుగా ఉంటుందనీ, నొప్పి భుజాల్లోకీ, వీపులోకి పాకుతుందని అనుకుంటారు. దవడ ఎముక బిగుసుకుపోతుందని, ఊపిరి అందక ఆయాసంతో ఒళ్లంతా చెమటలు కమ్మేస్తాయని నమ్ముతారు. నిజానికి ఈ లక్షణాలన్నీ గుండెపోటు సంకేతాలే. అయితే మారిన మన జీవన శైలి, అలవాట్లు, బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా ఇవాళ గుండె పోటు లక్షణాలు, తీరుతెన్నులు చాలావరకూ మారిపోతున్నాయి. ఒకప్పటిలా నొప్పి తెలియడం లేదు. ఛాతీపై బరువుగా ఉండటం, ఆయాసం వంటి లక్షణాలేమీ లేకుండానే గుండెపోటు ఇవాళ మన ప్రాణాల్ని తీస్తోంది. ముఖ్యంగా మహిళలు, షుగర్ జబ్బుతో బాధపడే వాళ్లలో ఇలా నొప్పి తెలియని గుండెపోటు ఎక్కువగా ఉంటోంది. పూర్తి వివరాలకు వీడియోను చివరి దాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి...

గుండె పోటు సమయంలో ఎడమ చేయి ఎందుకు లాగుతుంది?

Pain in the left arm is a common sign of a heart attack. Why would a heart attackcause pain or discomfort in our left arm? Here's the technical reason. heart attack may cause a sensation of pain to travel from your heart to your spinal cord, where many nerves merge onto the same nerve pathway. arm may be perfectly fine, but your brain thinks that part of the heart's pain is the arm or the jaw or the shoulder or the elbow or the neck or the upper back calling out for help.

మన్మధుని మరపించే మగ సిరి కోసం

తనువుల్ని, మనుసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతోపాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని చక్కదిద్దే ఆహార పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

Monday 22 July 2019

లేటు వయసులో సంతానమా?

ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి’’ అనే మాట ఎప్పగటి నుంచో వింటున్నదే. అయితే, పైకి ఇది చాలా పాతమాటగానే అనిపించినా, దాని వెనుక ఎంతో సైన్స్‌ ఉందని ఇటీవలి పరిశోధనల్లో బయటపడింది. ముఖ్యంగా లేటు వయసులో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల సమస్యలే కాకుండా, కొన్ని రకాల మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాకపోతే నడి వయసు స్త్రీకి కలిగిన పిల్లల్లో డౌన్‌ సిండ్రోమ్‌, అరుదైన కొన్ని క్రోమోజోమ్‌ సమస్యలు మాత్రమే ఉంటున్నాయని వారు అంటున్నారు. అదే నడివయసు పురుషుల్లో అయితే వాళ్ల వీర్యకణాల విభజన మరీ ఎక్కువగా జరిగి అవి పుట్టే పిల్లలకు హానికారక పరస్థితులను కలిగిస్తున్నాయని తెలుస్తోంది. 
  
అంతిమంగా ఇవి ఆటిజం, స్కిజోఫ్రేనియా వంటి రుగ్మతలను కలిగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ముఖ్యంగా, ఒక్కో ఏడు పెరిగే కొద్దీ పురుషుల డిఎన్‌ఏలో మరో రెండు కొత్త జన్యువులు కలుస్తున్నాయనీ, ఇవే ఈ రకమైన రుగ్మతలకు మూలమవుతున్నాయని చెబుతున్నారు. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో పిల్లలకు జన్మనివ్వాలనుకునే యువకులు తమ వీర్యాన్ని శాస్త్రీయ విధానాల్లో భద్రపరుచుకోవడం శ్రేయస్కర మని పరిశోధకులు సూచిస్తున్నారు.

Wednesday 12 December 2018

Tips for Starting a Healthy Lifestyle!

Healthy living is within your reach, starting today. Sure, healthy living is a long-term commitment, not a flash-in-the-pan fad. But there are steps you can take right now that will make today healthier than yesterday and pave the way for healthy living tomorrow, too. Here's your checklist of practical healthy living tips that are ready to go. Let's get started.

Thursday 22 November 2012

నిర్లక్ష్య వైద్యంపై అలుపెరగని పోరు...బాధిత కుటుంబాలకు ‘పీబీటీ’ ఆసరా

నిర్లక్ష్య వైద్యానికి నిండు ప్రాణం బలైందా?
కార్పొరేట్ వైద్యానికి లక్షలు వెచ్చించినా ఫలితం దక్కలేదా?
ఇదేమని ప్రశ్నించిన పాపానికి దిక్కున్న చోట చెప్పుకోమని గెంటేశారా?
- అయినవారు అనారోగ్యంతో బాధపడుతున్నపుడు...  స్తోమత లేకపోయినా మెడలోని పుస్తెల తాడు మొదలుకుని ఉన్న కాడికి ఆస్తులన్నీ తెగనమ్మి కార్పొరేట్ వైద్యం కోసం ఖరీదైన ఆస్పత్రుల తలుపులు తడతాం. తమ వారిని కాపాడుకునేందుకు అన్ని తంటాలు పడతాం. కానీ ప్రాణాలు నిలుపుతారనుకున్న వైద్యులే తమ వారి పాలిట యమ రాజులుగా మారితే? వారి నిర్లక్ష్యానికి తమ ఆత్మీయుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతే?? ఇదేమని ప్రశ్నించిన పాపానికి దిక్కున్న చోట చెప్పుకోమని ఆస్పత్రుల కర్కశ యజమాన్యాలు మెడపట్టి బయటకు గెంటేస్తే...??? ఇటు అయిన వారిని పోగొట్టుకుని అటు ఆర్థికంగా చితికిపోయిన వారి వేదనను మాటల్లో చెప్పలేం. నిర్లక్ష్య వైద్యానికి బలైన బాధితుల కుటుంబాల న్యాయ పోరాటానికి ‘పీబీటీ’ (పీపుల్స్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ఇండియా) అండగా నిలుస్తోంది. న్యాయం కోసం ఎలా ప్రయత్నించాలో, తగిన నష్ట పరిహారాన్ని పొందేందుకు మన ముందున్న మార్గాల గురించి దిశా నిర్దేశం చేస్తుంది. బాధితుల న్యాయ పోరాటంలో సదా వెన్నంటే ఉంటూ,  అవసరమైన అండదండలను అందిస్తుంది.

PBT Central Office:
Regus Business Center,
 Constantia Building (6th Floor), 
Wing A, Opp. La Martiniere School for Girls, 
11 U.N. Bramhachari Road, Kolkata 700017
Main:  (033) 4400-0581
Mr. Malay Ganguly, Secretary (Tel: 9038083120)
Mr. Mihir Banerjee, Vice-president (Tel: 9831983670)
Ms. Ratna Ghosh, Asst. Secretary (Tel: 9836706952)
Email: pbtindia2012@gmail.com

Saturday 10 November 2012

ఉచిత కంటి వైద్యానికి కేరాఫ్ అడ్రస్ మధురై అరవింద్ నేత్ర వైద్య శాల

కంటి జబ్బులకు వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరాన్ని తప్పిస్తోంది  తమిళనాడులోని మధురై పట్టణంలోని అరవింద్ నేత్ర వైద్య శాల. కేవలం స్తోమత కలిగిన వాళ్లు అందించే ఆర్థిక సాయాన్ని ఊతంగా చేసుకుని పేదలకు ఉచితంగా సేవలు అందిస్తోంది.
అరవింద్ లో సేవలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.
ఒకటి పూర్తిగా ఉచితం. రెండు తగ్గింపు ధరలు. మూడు పూర్తి చెల్లింపు.
పూర్తి ఫీజు చెల్లించాలా? సబ్బిడీ తీసుకోవాలా? లేక పూర్తిగా ఉచితంగా వైద్యం పొందాలా అన్నది పూర్తిగా రోగి, రోగి కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. ఎలాంటి ధృవ పత్రాలు చూపించక్కర్లేదు. ఖరీదైన కార్లో దిగి ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకున్నా ఎవరూ అడ్డు చెప్పరు.
ఒక్కసారి ఆస్పత్రిలో కాలు పెట్టాక ధనిక, పేదా, బడుగు, బలహీన వర్గాలనే తేడాలు ఉండవు. ఖరీదైన వైద్యాన్ని కార్పొరేట్ స్టైల్ లో అందించడం అరవింద్ నేత్ర వైద్య శాల ప్రత్యేకత.
వ్యాపారంతోపాటు సేవాభావాలను మిళితం చేసి ఉచిత నేత్ర వైద్య సేవలను అందిస్తున్న అరవింద్ ను హార్వర్డ్ యూనివర్శిటీ కూడా గుర్తించింది. 
ఒంటి నిండా పైపులు, ముఖానికి ఆక్సిజన్ మాస్కు, శరీరంపై సూదులతో పొడిచిన గుర్తులు, మందుల దుప్ఫ్రభావాలు, ఆత్మీయులకు అడ్డుగా అద్దాల కంచెలు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఏ రోగి అయినా ఇంత పరాధీనంగా, ఇంత నిస్సహాయంగా ఎందుకు మరణించాలి? ప్రశాంతమైన తుది వీడ్కోలు ప్రతి ఒక్కరి హక్కు. స్పర్స్ హాస్పైస్ ఆ హక్కును కాపాడుతుంది.

స్పర్శ్ చిరునామా...
ఫ్లాట్ నంబర్ 85, 82703/2/1,
రోడ్ నంబర్ 12,
బంజారాహిల్స్,
హైదరాబాద్.
ఫోన్ నంబర్  94904 48222

Friday 8 June 2012

మోకీళ్లలో గుజ్జు తగ్గిపోయినపుడు కీలు మార్పిడి సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదిపుడు. మోకీళ్లలో తగ్గిపోయిన గుజ్జును పెంచేందుకు గ్లూకోజమైన్ మాత్రలు మొదలుకుని కృత్రిమంగా ప్రయోగశాలలో కార్టిలేజ్ కణాలను పెంచేంత వరకూ నేడు వైద్య శాస్త్రం అభివృద్ది చెందింది. మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి పెంచే సెల్ థెరపీ గురించిన ప్రత్యేక కథనం కోసం ఈ వీడియోను చూడండి. 4

మోకీళ్లలో గుజ్జు తగ్గిపోయినపుడు కీలు మార్పిడి సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదిపుడు. మోకీళ్లలో తగ్గిపోయిన గుజ్జును పెంచేందుకు గ్లూకోజమైన్ మాత్రలు మొదలుకుని కృత్రిమంగా ప్రయోగశాలలో కార్టిలేజ్ కణాలను పెంచేంత వరకూ నేడు వైద్య శాస్త్రం అభివృద్ది చెందింది. మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి పెంచే సెల్ థెరపీ గురించిన ప్రత్యేక కథనం కోసం ఈ వీడియోను చూడండి. 3

మోకీళ్లలో గుజ్జు తగ్గిపోయినపుడు కీలు మార్పిడి సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదిపుడు. మోకీళ్లలో తగ్గిపోయిన గుజ్జును పెంచేందుకు గ్లూకోజమైన్ మాత్రలు మొదలుకుని కృత్రిమంగా ప్రయోగశాలలో కార్టిలేజ్ కణాలను పెంచేంత వరకూ నేడు వైద్య శాస్త్రం అభివృద్ది చెందింది. మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి పెంచే సెల్ థెరపీ గురించిన ప్రత్యేక కథనం కోసం ఈ వీడియోను చూడండి. 1

మోకీళ్లలో గుజ్జు తగ్గిపోయినపుడు కీలు మార్పిడి సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదిపుడు. మోకీళ్లలో తగ్గిపోయిన గుజ్జును పెంచేందుకు గ్లూకోజమైన్ మాత్రలు మొదలుకుని కృత్రిమంగా ప్రయోగశాలలో కార్టిలేజ్ కణాలను పెంచేంత వరకూ నేడు వైద్య శాస్త్రం అభివృద్ది చెందింది. మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి పెంచే సెల్ థెరపీ గురించిన ప్రత్యేక కథనం కోసం ఈ వీడియోను చూడండి. 2

Sunday 22 April 2012

సర్జరీతో షుగర్ జబ్బు మాయం?- అవును మీరు వింటున్నది నిజమే.. షుగర్ వ్యాధి ఇపుడెంత మాత్రం జీవితకాలపు జబ్బు కాదు; రోజూ మందులు మింగడం, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకోవాల్సిన అవసరం ఇకపై ఎంతమాత్రం లేదు. స్వీట్లకు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సిన పనే లేదు. జస్ట్ డయాబెటిక్ సర్జరీ చేయించుకుంటే చాలు, షుగర్ జబ్బును దాదాపు 90 శాతానికి పైగా నయం చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వీడియోను చూడండి...

Friday 9 March 2012

రక్తాన్ని దానం చేయడాన్ని మనం చాలా గొప్పగా భావిస్తాం. నిజమే... ఇచ్చిన రక్తం మళ్లీ మూడు నెలల లోపే మనలో తయారయిపోతుంది కాబట్టి రక్తదానానికి పెద్దగా సంకోచించం. కానీ కిడ్నీలు ఫెయిలయి, వేరే ఎవరైనా కిడ్నీ ఇస్తేగానీ ప్రాణాలు నిలవని స్థితిలో మనలో ఎంతమంది నిస్వార్థంగా కిడ్నీ దానానికి ముందుకొస్తారు? చాలా సందర్భాల్లో పేషెంట్ సంబంధీకులు మాత్రమే కిడ్నీ ఇస్తుంటారు. ఈ పరిస్థితి మారాలి. ఇవాళ మన దగ్గర ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. ఒక కిడ్నీని దానం చేసినా; మిగిలిన ఒక్క కిడ్నీతో ఎలాంటి సమస్యలూ లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. మనం ఇచ్చే కిడ్నీ వేరొకరి జీవితంలో వెలుగులు నింపడమే కాదు, ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబాన్ని ఆదుకున్న వారమవుతాం. కిడ్నీ దానం గురించిన పూర్తి వివరాలకు ఈ వీడియోను చూడండి...