Monday, 22 July 2019

లేటు వయసులో సంతానమా?










                                                                            
ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి’’ అనే మాట ఎప్పగటి నుంచో వింటున్నదే. అయితే, పైకి ఇది చాలా పాతమాటగానే అనిపించినా, దాని వెనుక ఎంతో సైన్స్‌ ఉందని ఇటీవలి పరిశోధనల్లో బయటపడింది. ముఖ్యంగా లేటు వయసులో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల సమస్యలే కాకుండా, కొన్ని రకాల మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాకపోతే నడి వయసు స్త్రీకి కలిగిన పిల్లల్లో డౌన్‌ సిండ్రోమ్‌, అరుదైన కొన్ని క్రోమోజోమ్‌ సమస్యలు మాత్రమే ఉంటున్నాయని వారు అంటున్నారు. అదే నడివయసు పురుషుల్లో అయితే వాళ్ల వీర్యకణాల విభజన మరీ ఎక్కువగా జరిగి అవి పుట్టే పిల్లలకు హానికారక పరస్థితులను కలిగిస్తున్నాయని తెలుస్తోంది. 
  
అంతిమంగా ఇవి ఆటిజం, స్కిజోఫ్రేనియా వంటి రుగ్మతలను కలిగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ముఖ్యంగా, ఒక్కో ఏడు పెరిగే కొద్దీ పురుషుల డిఎన్‌ఏలో మరో రెండు కొత్త జన్యువులు కలుస్తున్నాయనీ, ఇవే ఈ రకమైన రుగ్మతలకు మూలమవుతున్నాయని చెబుతున్నారు. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో పిల్లలకు జన్మనివ్వాలనుకునే యువకులు తమ వీర్యాన్ని శాస్త్రీయ విధానాల్లో భద్రపరుచుకోవడం శ్రేయస్కర మని పరిశోధకులు సూచిస్తున్నారు.

No comments: