Saturday 4 February 2012

చకచకా మందులు...?

ఆసుపత్రిలో…
“ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి” అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.
Doctor చక చక మందులు రాసిచ్చాడు.
Patient వెళ్ళిపోగానే-
“అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?” అడిగాడు junior doctor.
“అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు నచ్చదు” నవ్వుతూ చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి

మూత్ర పరీక్ష?

కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.
డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు
“ఎందుకేడుస్తున్నావు ” పలకరించాడు లింగం మావ.
“Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు”
“అయితే”
“రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది”
అంతే…. ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం మావ…