Friday 13 December 2019

నొప్పి లేని గుండె పోటు గురించి మీకు తెలుసా?


గుండె పోటు అంటే ఛాతీ అంతా పిండేసి నట్టుగా నొప్పి ఉంటుందని నమ్ముతారు మనలో చాలామంది. ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుందనీ, ఛాతీపై ఎవరో కూర్చున్నంత బరువుగా ఉంటుందనీ, నొప్పి భుజాల్లోకీ, వీపులోకి పాకుతుందని అనుకుంటారు. దవడ ఎముక బిగుసుకుపోతుందని, ఊపిరి అందక ఆయాసంతో ఒళ్లంతా చెమటలు కమ్మేస్తాయని నమ్ముతారు. నిజానికి ఈ లక్షణాలన్నీ గుండెపోటు సంకేతాలే. అయితే మారిన మన జీవన శైలి, అలవాట్లు, బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా ఇవాళ గుండె పోటు లక్షణాలు, తీరుతెన్నులు చాలావరకూ మారిపోతున్నాయి. ఒకప్పటిలా నొప్పి తెలియడం లేదు. ఛాతీపై బరువుగా ఉండటం, ఆయాసం వంటి లక్షణాలేమీ లేకుండానే గుండెపోటు ఇవాళ మన ప్రాణాల్ని తీస్తోంది. ముఖ్యంగా మహిళలు, షుగర్ జబ్బుతో బాధపడే వాళ్లలో ఇలా నొప్పి తెలియని గుండెపోటు ఎక్కువగా ఉంటోంది. పూర్తి వివరాలకు వీడియోను చివరి దాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి...

No comments: