Friday, 9 March 2012
రక్తాన్ని దానం చేయడాన్ని మనం చాలా గొప్పగా భావిస్తాం. నిజమే... ఇచ్చిన రక్తం మళ్లీ మూడు నెలల లోపే మనలో తయారయిపోతుంది కాబట్టి రక్తదానానికి పెద్దగా సంకోచించం. కానీ కిడ్నీలు ఫెయిలయి, వేరే ఎవరైనా కిడ్నీ ఇస్తేగానీ ప్రాణాలు నిలవని స్థితిలో మనలో ఎంతమంది నిస్వార్థంగా కిడ్నీ దానానికి ముందుకొస్తారు? చాలా సందర్భాల్లో పేషెంట్ సంబంధీకులు మాత్రమే కిడ్నీ ఇస్తుంటారు. ఈ పరిస్థితి మారాలి. ఇవాళ మన దగ్గర ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. ఒక కిడ్నీని దానం చేసినా; మిగిలిన ఒక్క కిడ్నీతో ఎలాంటి సమస్యలూ లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. మనం ఇచ్చే కిడ్నీ వేరొకరి జీవితంలో వెలుగులు నింపడమే కాదు, ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబాన్ని ఆదుకున్న వారమవుతాం. కిడ్నీ దానం గురించిన పూర్తి వివరాలకు ఈ వీడియోను చూడండి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment