Thursday 22 November 2012

నిర్లక్ష్య వైద్యంపై అలుపెరగని పోరు...బాధిత కుటుంబాలకు ‘పీబీటీ’ ఆసరా

నిర్లక్ష్య వైద్యానికి నిండు ప్రాణం బలైందా?
కార్పొరేట్ వైద్యానికి లక్షలు వెచ్చించినా ఫలితం దక్కలేదా?
ఇదేమని ప్రశ్నించిన పాపానికి దిక్కున్న చోట చెప్పుకోమని గెంటేశారా?
- అయినవారు అనారోగ్యంతో బాధపడుతున్నపుడు...  స్తోమత లేకపోయినా మెడలోని పుస్తెల తాడు మొదలుకుని ఉన్న కాడికి ఆస్తులన్నీ తెగనమ్మి కార్పొరేట్ వైద్యం కోసం ఖరీదైన ఆస్పత్రుల తలుపులు తడతాం. తమ వారిని కాపాడుకునేందుకు అన్ని తంటాలు పడతాం. కానీ ప్రాణాలు నిలుపుతారనుకున్న వైద్యులే తమ వారి పాలిట యమ రాజులుగా మారితే? వారి నిర్లక్ష్యానికి తమ ఆత్మీయుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతే?? ఇదేమని ప్రశ్నించిన పాపానికి దిక్కున్న చోట చెప్పుకోమని ఆస్పత్రుల కర్కశ యజమాన్యాలు మెడపట్టి బయటకు గెంటేస్తే...??? ఇటు అయిన వారిని పోగొట్టుకుని అటు ఆర్థికంగా చితికిపోయిన వారి వేదనను మాటల్లో చెప్పలేం. నిర్లక్ష్య వైద్యానికి బలైన బాధితుల కుటుంబాల న్యాయ పోరాటానికి ‘పీబీటీ’ (పీపుల్స్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ఇండియా) అండగా నిలుస్తోంది. న్యాయం కోసం ఎలా ప్రయత్నించాలో, తగిన నష్ట పరిహారాన్ని పొందేందుకు మన ముందున్న మార్గాల గురించి దిశా నిర్దేశం చేస్తుంది. బాధితుల న్యాయ పోరాటంలో సదా వెన్నంటే ఉంటూ,  అవసరమైన అండదండలను అందిస్తుంది.


PBT Central Office:
Regus Business Center,
 Constantia Building (6th Floor), 
Wing A, Opp. La Martiniere School for Girls, 
11 U.N. Bramhachari Road, Kolkata 700017
Main:  (033) 4400-0581
Mr. Malay Ganguly, Secretary (Tel: 9038083120)
Mr. Mihir Banerjee, Vice-president (Tel: 9831983670)
Ms. Ratna Ghosh, Asst. Secretary (Tel: 9836706952)
Email: pbtindia2012@gmail.com






No comments: