Tuesday, 31 December 2019


పెళ్లై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ ఊసే లేకపోవడం అన్నది దంపతుల్ని అనుక్షణం తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తుంది. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సి, ఇమ్సి వంటి అత్యాధునిక చికిత్సల సాయంతో నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించడం ఇపుడు ఏమంత కష్టం కాదు. భర్తలో వీర్య కణాలు ఏమాత్రం లేకపోవడం అంటే జీరో కౌంట్ ఉన్నవారికి కూడా ఇపుడు టెసా అనే ఒక సరికొత్త పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మరవకండి.

Thursday, 26 December 2019

ఈ బ్లడ్ నిజంగా బంగారమే... (Golden Blood)


రక్తం అంటే మనకు ప్రాణాధారం. మన ఒంట్లోని అణువణువుకూ జవజీవాలతోపాటు ప్రాణ వాయువును అందించే అపురూపమైన సంజీవిని. అందుకే రక్తదానాన్ని మనం ప్రాణదానంగా పేర్కొంటున్నాం. ఇక మన రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు ఉంటాయని మనకు తెలుసు. వీటిలో అరుదైన బ్లడ్ గ్రూపు ఏదంటే వెంటనే మనలో చాలామంది ఓ గ్రూపు అని ఠక్కున చెప్పేస్తారు. ఇంకాస్త అవగాహన ఉన్నవాళ్లైతే... బాంబే బ్లడ్ గ్రూప్ అని చెబుతారు. కానీ వీటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ మరోటి ఉంది. దాని పేరే గోల్డెన్ బ్లడ్. పేరుకు తగ్గట్టుగానే అది నిజంగా బంగారమే. 
బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 43 మంది వ్యక్తుల్లో మాత్రమే ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇదెంత అరుదైన గ్రూపు రక్తమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ బ్లడ్ కలిగిన వ్యక్తులు ఓ గ్రూపు వ్యక్తుల్లాగే అందరికీ తమ రక్తాన్ని దానం చేయొచ్చు. కానీ వీరికి రక్తం అవసరమైనపుడు మాత్రం దాతలు దొరికే పరిస్థితి ఉండదు. కాస్త కష్టమైనా ఓ గ్రూపు రక్తాన్ని ఎక్కడి నుంచైనా పట్టుకు రావొచ్చేమోగానీ... గోల్డెన్ బ్లడ్ ను పట్టుకు రావడానికి ప్రపంచమంతా తిరగాల్సి ఉంటుంది.
గోల్డెన్ బ్లడ్... పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైంది.  ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్ (Rh null). ఈ రక్తం ఎందుకంత ప్రత్యేకం? దీన్ని బంగారంతో ఎందుకు పోల్చుతారు? ఈ రక్తం కలిగి ఉండటం ఎందుకు ప్రమాదకరం? ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే, ముందుగా మన బ్లడ్ గ్రూపులు ఏ, బీ, ఏబీ, ఓ లను ఎలా వర్గీకరించారో తెలుసుకోవాలి.
సాధారణంగా మన రక్తంలోని రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. '' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ యాంటీజెన్లు రెండూ ఉండవు. అలాగే ఎర్ర రక్త కణాలు 61 Rh రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు. గోల్డెన్ బ్లడ్ గా పిలుస్తోన్న Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు. వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్‌సైట్ మొజాయిక్‌లో ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది.
గోల్డెన్ బ్లడ్ రావడం అనేది వంశపారంపర్యంగానే జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు వివరించారు. బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. అలాగే ఈ రక్తాన్ని కలిగి ఉండటం అనేది ప్రమాదం కూడా. ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.

Monday, 23 December 2019


ఇవాళ పొట్టను చేత పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అజీర్ణం, ఎసిడిటీ, పులి తేన్పులు, కడుపు ఉబ్బరం, గ్యాస్... ఇలా ఉదర భాదలకు అంతం ఉండటం లేదు. అసలు తినాలనిపించక పోవడం, ఏం తిన్నా విరేచనం అయిపోవడం, ఛాతీలో, కడుపులో మంట, ఆపాన వాయువులు... ఇలా పొట్టలో ఇవాళ చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. మరి ఈ ఎసిడిటీ బాధల నుంచి విముక్తి ఎలా? ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం కలిగించే చిట్కాల కోసం వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మరవకండి.
https://youtu.be/20De3xPIVM4
www.arogyamastu.blogspot.com

తనువుల్ని, మనుసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతోపాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని చక్కదిద్దే ఆహార పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

https://youtu.be/FHA6Dq70WaM
www.arogyamastu.blogspot.com



పరిమితంగా, రోజుకు ఒక పెగ్గుకు మించకుండా మద్యాన్ని పుచ్చకుంటే అది మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన గుండెకు ఎంతగానో మేలు చేస్తుందనే నమ్మకం ఇవాళ మనలో చాలామందిలో ఉంది. ప్రత్యేకించి రెడ్ వైన్ తాగితే గుండె బలం పుంజుకుంటుందని నమ్ముతారు. అసలీ నమ్మకాల్లో నిజమెంత? మద్యాన్ని మితంగా తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కి సబ్ స్క్రైబ్ చేయండి.
https://youtu.be/0_Nshyup25A
www.arogyamastu.blogspot.com

Thursday, 19 December 2019


పక్షవాతానికి గురవుతోన్న సమయంలో మన మెదడు మనతో మాట్లాడటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కొన్ని లక్షణాల ద్వారా తన సందేశాన్ని పంపుతుంది. ఆ లక్షణాలను మనం ఇంగ్లీషులో FAST అని గుర్తుంచుకుంటే చాలు. పక్షవాతాన్ని ఆదిలోనే పసిగట్టి సత్వర వైద్యాన్ని పొందే వీలుంటుంది. పక్షవాతం తాలూకు దుష్ఫలితాలను సైతం నివారించుకునే అవకాశం దొరుకుతుంది. ఇంతకీ FAST అనే పదంలోని ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

Friday, 13 December 2019

నొప్పి లేని గుండె పోటు గురించి మీకు తెలుసా?


గుండె పోటు అంటే ఛాతీ అంతా పిండేసి నట్టుగా నొప్పి ఉంటుందని నమ్ముతారు మనలో చాలామంది. ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుందనీ, ఛాతీపై ఎవరో కూర్చున్నంత బరువుగా ఉంటుందనీ, నొప్పి భుజాల్లోకీ, వీపులోకి పాకుతుందని అనుకుంటారు. దవడ ఎముక బిగుసుకుపోతుందని, ఊపిరి అందక ఆయాసంతో ఒళ్లంతా చెమటలు కమ్మేస్తాయని నమ్ముతారు. నిజానికి ఈ లక్షణాలన్నీ గుండెపోటు సంకేతాలే. అయితే మారిన మన జీవన శైలి, అలవాట్లు, బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా ఇవాళ గుండె పోటు లక్షణాలు, తీరుతెన్నులు చాలావరకూ మారిపోతున్నాయి. ఒకప్పటిలా నొప్పి తెలియడం లేదు. ఛాతీపై బరువుగా ఉండటం, ఆయాసం వంటి లక్షణాలేమీ లేకుండానే గుండెపోటు ఇవాళ మన ప్రాణాల్ని తీస్తోంది. ముఖ్యంగా మహిళలు, షుగర్ జబ్బుతో బాధపడే వాళ్లలో ఇలా నొప్పి తెలియని గుండెపోటు ఎక్కువగా ఉంటోంది. పూర్తి వివరాలకు వీడియోను చివరి దాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి...

గుండె పోటు సమయంలో ఎడమ చేయి ఎందుకు లాగుతుంది?



Pain in the left arm is a common sign of a heart attack. Why would a heart attackcause pain or discomfort in our left arm? Here's the technical reason. heart attack may cause a sensation of pain to travel from your heart to your spinal cord, where many nerves merge onto the same nerve pathway. arm may be perfectly fine, but your brain thinks that part of the heart's pain is the arm or the jaw or the shoulder or the elbow or the neck or the upper back calling out for help.

మన్మధుని మరపించే మగ సిరి కోసం




తనువుల్ని, మనుసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతోపాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని చక్కదిద్దే ఆహార పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

Monday, 22 July 2019

లేటు వయసులో సంతానమా?










                                                                            
ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి’’ అనే మాట ఎప్పగటి నుంచో వింటున్నదే. అయితే, పైకి ఇది చాలా పాతమాటగానే అనిపించినా, దాని వెనుక ఎంతో సైన్స్‌ ఉందని ఇటీవలి పరిశోధనల్లో బయటపడింది. ముఖ్యంగా లేటు వయసులో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల సమస్యలే కాకుండా, కొన్ని రకాల మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాకపోతే నడి వయసు స్త్రీకి కలిగిన పిల్లల్లో డౌన్‌ సిండ్రోమ్‌, అరుదైన కొన్ని క్రోమోజోమ్‌ సమస్యలు మాత్రమే ఉంటున్నాయని వారు అంటున్నారు. అదే నడివయసు పురుషుల్లో అయితే వాళ్ల వీర్యకణాల విభజన మరీ ఎక్కువగా జరిగి అవి పుట్టే పిల్లలకు హానికారక పరస్థితులను కలిగిస్తున్నాయని తెలుస్తోంది. 
  
అంతిమంగా ఇవి ఆటిజం, స్కిజోఫ్రేనియా వంటి రుగ్మతలను కలిగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ముఖ్యంగా, ఒక్కో ఏడు పెరిగే కొద్దీ పురుషుల డిఎన్‌ఏలో మరో రెండు కొత్త జన్యువులు కలుస్తున్నాయనీ, ఇవే ఈ రకమైన రుగ్మతలకు మూలమవుతున్నాయని చెబుతున్నారు. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో పిల్లలకు జన్మనివ్వాలనుకునే యువకులు తమ వీర్యాన్ని శాస్త్రీయ విధానాల్లో భద్రపరుచుకోవడం శ్రేయస్కర మని పరిశోధకులు సూచిస్తున్నారు.