Tuesday, 31 December 2019
Thursday, 26 December 2019
ఈ బ్లడ్ నిజంగా బంగారమే... (Golden Blood)
రక్తం అంటే మనకు ప్రాణాధారం.
మన ఒంట్లోని అణువణువుకూ జవజీవాలతోపాటు ప్రాణ వాయువును అందించే అపురూపమైన సంజీవిని.
అందుకే రక్తదానాన్ని మనం ప్రాణదానంగా పేర్కొంటున్నాం. ఇక మన రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ
గ్రూపులు ఉంటాయని మనకు తెలుసు. వీటిలో అరుదైన బ్లడ్ గ్రూపు ఏదంటే వెంటనే మనలో
చాలామంది ఓ గ్రూపు అని ఠక్కున చెప్పేస్తారు. ఇంకాస్త అవగాహన ఉన్నవాళ్లైతే... బాంబే
బ్లడ్ గ్రూప్ అని చెబుతారు. కానీ వీటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ మరోటి ఉంది. దాని
పేరే గోల్డెన్ బ్లడ్. పేరుకు తగ్గట్టుగానే అది నిజంగా బంగారమే.
బంగారంలాంటి ఈ రక్తం
ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 43 మంది వ్యక్తుల్లో మాత్రమే ఉందని అధికారిక గణాంకాలు
చెబుతున్నాయి. అంటే ఇదెంత అరుదైన గ్రూపు రక్తమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్
బ్లడ్ కలిగిన వ్యక్తులు ఓ గ్రూపు వ్యక్తుల్లాగే అందరికీ తమ రక్తాన్ని దానం
చేయొచ్చు. కానీ వీరికి రక్తం అవసరమైనపుడు మాత్రం దాతలు దొరికే పరిస్థితి ఉండదు.
కాస్త కష్టమైనా ఓ గ్రూపు రక్తాన్ని ఎక్కడి నుంచైనా పట్టుకు రావొచ్చేమోగానీ...
గోల్డెన్ బ్లడ్ ను పట్టుకు రావడానికి ప్రపంచమంతా తిరగాల్సి ఉంటుంది.
గోల్డెన్ బ్లడ్... పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైంది. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్ నల్
(Rh null). ఈ రక్తం ఎందుకంత ప్రత్యేకం? దీన్ని బంగారంతో ఎందుకు
పోల్చుతారు? ఈ రక్తం కలిగి ఉండటం ఎందుకు ప్రమాదకరం? ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే, ముందుగా మన బ్లడ్
గ్రూపులు ఏ, బీ, ఏబీ, ఓ లను ఎలా వర్గీకరించారో తెలుసుకోవాలి.
సాధారణంగా మన రక్తంలోని రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత
ఉంటుంది. 'ఏ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి.
ఓ గ్రూపులో ఏ, బీ యాంటీజెన్లు రెండూ ఉండవు. అలాగే ఎర్ర రక్త
కణాలు 61 Rh రకానికి చెందిన RhD అనే
మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే +
(పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు. గోల్డెన్ బ్లడ్ గా
పిలుస్తోన్న Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త
కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు. వైద్య పరిశోధనల వివరాలను
అందించే వెబ్‌సైట్ మొజాయిక్‌లో ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును
తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం
ఉందని వెల్లడైంది.
గోల్డెన్ బ్లడ్ రావడం అనేది వంశపారంపర్యంగానే జరుగుతుందని, దీనికి వారి
తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న
పరిశోధకులు వివరించారు. బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. అలాగే ఈ
రక్తాన్ని కలిగి ఉండటం అనేది ప్రమాదం కూడా. ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారికి రక్తం
అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన
వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని
దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.
Monday, 23 December 2019
https://youtu.be/20De3xPIVM4
www.arogyamastu.blogspot.com
https://youtu.be/FHA6Dq70WaM
www.arogyamastu.blogspot.com
పరిమితంగా, రోజుకు ఒక పెగ్గుకు మించకుండా మద్యాన్ని పుచ్చకుంటే అది మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన గుండెకు ఎంతగానో మేలు చేస్తుందనే నమ్మకం ఇవాళ మనలో చాలామందిలో ఉంది. ప్రత్యేకించి రెడ్ వైన్ తాగితే గుండె బలం పుంజుకుంటుందని నమ్ముతారు. అసలీ నమ్మకాల్లో నిజమెంత? మద్యాన్ని మితంగా తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కి సబ్ స్క్రైబ్ చేయండి.
https://youtu.be/0_Nshyup25A
www.arogyamastu.blogspot.com
Thursday, 19 December 2019
Friday, 13 December 2019
నొప్పి లేని గుండె పోటు గురించి మీకు తెలుసా?
గుండె పోటు సమయంలో ఎడమ చేయి ఎందుకు లాగుతుంది?
మన్మధుని మరపించే మగ సిరి కోసం
తనువుల్ని, మనుసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతోపాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని చక్కదిద్దే ఆహార పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు వీడియోను చివరిదాకా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
Subscribe to:
Posts (Atom)